గురువారం, 29 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తుఫాన్ కి దెబ్బతిన్న వరి పంటలు పరిశీలన

1 గంట క్రితం

Inspection of paddy crops damaged by the cyclone
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 04:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : అర్నబ్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాఖ అధికారులు గురువారం పరిశీలించారు. ఇందులో భాగంగా ఏడిఏ సిహెచ్.కె.వి. చౌదరి, వ్యవసాయ శాఖ ఏవో బి.మీనా లతో పాటు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈదల సత్తిబాబు మండల కేంద్రానికి చెందిన వరి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వివిధ రకాల పంటలను, వాటి నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సత్తిబాబు కోరారు. ఈ సందర్భంగా రైతులు తమకు జరిగిన పంట నష్టాన్ని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్