గురువారం, 29 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

750 ఎకరాల్లో వరి పంట నష్టం

1 గంట క్రితం

Loss of paddy crop across 750 acres
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 04:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - జగ్గంపేట (కాకినాడ) : మండలంలోని రామవరం, సీతానగరం, కాట్రావులపల్లి గ్రామాల్లో 750 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగినట్లు వ్యవసాయాధికారులు నిర్ధారించారు. తుఫాన్ ప్రభావంతో వచ్చిన ఈదురు గాలులకు మండలంలో 1400 ఎకరాల వరి పంట నీట మునిగింది. ఐతే ఆ పంటల్లో 750 ఎకరాలకు నష్టం వాటిల్లింది. నష్టానికి గురైన పంటలను మారుటేరు శాస్త్రవేత్తలు చల్లా వెంకట నరసింహరావు, శేఖర్, దక్షిణామూర్తి, ఎడిఎ జి శ్రీనివాసరావు, ఎఓ ఎస్ నరసింహం గురువారం పరిశీలించారు. రైతులకు శాస్త్రవేత్తలు సూచనలు: పూత, పాలు పోసుకునే, కోత దశల్లో పొలాల నుండి వర్షపు నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపించాలని శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. వర్షం తగ్గిన తర్వాత ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటె పూత దశకు ముందు పంటలకు ఎండాకు, మానిపండు, మాగుడు, ఆకుముడత , దోమపోటు తెగుళ్లు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈనిక దశలో ఉన్న చేలు కింద పడిపోయి ఒక రోజు నీటిలో మునిగితే తాలు గింజలు ఏర్పడి 75 శాతం పంట నష్టం జరుగుతుందన్నారు. నిలబడి ఉన్న పడిపోయిన చేలలో గింజలు రంగు మారటం, మాగుడు తెగులు మానిపండు తెగులు వ్యాప్తిని నివారించేందుకు ఎకరాకు 200 మి.లీ. ప్రోపికోనాజోల్ పిచికారీ చేయాలని సూచించారు. కోత దశలో ఉండి పడిపోయిన పంటలు నష్టపోకుండా ఉండేందుకు నీరు బయటకు తీసిన తర్వాత 5 శాతం ఉప్పు ద్రావణం (50 గ్రాములు కల్లు ఉప్పు / లీటరు నీటికి)కలిపి పిచికారీ చేయాలన్నారు.
Loss of paddy crop across 750 acres

Loss of paddy crop across 750 acres


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్