సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిపిఎం సానుభూతిపరులు బడుగు వెంకటేశ్వరరావు కన్నుమూత

12 సెప్టెంబర్, 2026

vankateswarao.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 06:48 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి–తాడేపల్లి రూరల్: ఎంటీఎంసీ పరిధిలోని కుంచనపల్లి గ్రామానికి చెందిన సిపిఎం సానుభూతిపరులు బడుగు వెంకటేశ్వరరావు (70) శుక్రవారం రాత్రి 9.40 గంటల సమయంలో గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఛాతిలో నొప్పి రావడంతో ఇంట్లోనే అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే విజయవాడలోని హెల్ప్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వెంకటేశ్వరరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1974 నుంచి గుంటూరులో సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన అనేక పోరాటాలు, ఆందోళనల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. అనంతరం 1992 తరువాత స్వగ్రామమైన కుంచనపల్లిలో సిపిఎం సభ్యుడిగా సుదీర్ఘకాలం అనేక పోరాటాలు, ఉద్యమాల్లో పాల్గొన్నారు. రైతు సంఘం, కౌలు రైతు సంఘం బాధ్యులుగా కొంతకాలం పనిచేశారు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా అనంతరం సీపీఎం సానుభూతిపరుడిగా కొనసాగారు. వెంకటేశ్వరరావు అంత్యక్రియలు శనివారం కుంచనపల్లి గ్రామంలో జరగనున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్