ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా) : పట్టణానికి చెందిన సీనియర్ గుండె వైద్య నిపుణులు, టిడిపి సీనియర్ నాయకులు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి (89) మంగళవారం మృతి చెందారు. కొద్దిరోజులుగా అస్వస్థతకు గురైన ఆయన విజయవాడ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డాక్టర్ దక్షిణామూర్తి పట్టణంలో శివాజీ చౌక్ కూడలిలో గీత నర్సింగ్ హోమ్ ను స్థాపించి సుదీర్ఘంగా వైద్య సేవలు అందించారు. కార్పొరేట్ వైద్య పోకడలకు భిన్నంగా అందించే వైద్య సేవలు, వైద్య సలహాలు పేద బడుగు బలహీన వర్గాలను సైతం విశేషంగా ఆకట్టుకున్నాయి. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా వైద్య వృత్తిలో ఉన్న ఆయన ఎందరికీ ప్రాణభిక్ష పెట్టారు. ఆయన మృతికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బృందం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ములకా శివ సాంబిరెడ్డి, సిపిఎం నాయకులు కె బాబు ప్రసాద్, పట్టణ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
సీనియర్ వైద్యులు డాక్టర్ దక్షిణామూర్తి మృతి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 27, 2026, 12:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)