మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి : వామపక్షాల నిరసన

17 గంటల క్రితం

Gyanesh Kumar must resign: Left parties protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 11:53 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ... మంగళవారం మంగళగిరిలో సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ... భారత ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీసే విధంగా జ్ఞానేశ్ కుమార్ వ్యవహరించారని విమర్శించారు. తోటి ఎలక్షన్ కమిషన్ సభ్యుల అభిప్రాయాలను, మెజార్టీ నిర్ణయాలను తుంగలో తొక్కి ఏకపక్ష నిర్ణయాలతో వెళ్ళారని విమర్శించారు. 13 కోట్ల ఓటర్లను జాబితా నుండి తొలగించి ప్రజాస్వామ్యానికి పెను సవాల్ విసిరిన జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత పార్లమెంట్ సమావేశాల్లోనే స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ పేరుతో ఓట్లను చోరీ చేసే విధానాన్ని వ్యతిరేకిస్తూ జ్ఞానేష్ కుమార్ పై పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాసానికి నోటీస్ ఇచ్చినప్పటికీ రాజ్యసభ, లోక్ సభ స్పీకర్లు ఆమోదించకుండా అడ్డుకున్నారని విమర్శించారు. మిగతా ఎలక్షన్ కమిషనర్లు 14 సార్లు జ్ఞానేశ్ కుమార్ నిర్ణయాలను తప్పుపడుతూ లేఖలు ఇచ్చినప్పటికీ ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అండ్ తో వాటిని పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించారని అన్నారు. నియంతల వ్యవహరిస్తున్న జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మంగళగిరి పట్టణ కార్యదర్శి వి వి జవహర్లాల్, సీనియర్ నాయకులు జెవి రాఘవులు, పిల్లలమర్రి బాలకృష్ణ, సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాలాజీ, సిపిఎం పట్టణ నాయకులు ఎం చలపతిరావు, టి శ్రీరాములు, జి వెంకయ్య, బి. స్వామినాథ, సిపిఐ పట్టణ కార్యదర్శి ఏ ప్రభాకర్, సిపిఐ మంగళగిరి మండల రూరల్ కార్యదర్శి జాలాది జాన్ బాబు, సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి నందం బ్రహ్మేశ్వరరావు, బి వెంకటేశ్వరరావు, సిపిఐ ఎంఎల్ నాయకులు కి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్