గుంటూరు : తమకు రక్షణ కల్పించాలని, స్టైఫండ్ పెంచాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ ... శుక్రవారం గుంటూరు నగరంలో జూనియర్ డాక్టర్లు బైక్ ర్యాలీ నిర్వహించారు. "మా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. మాకు రావాల్సిన స్టైఫండ్‌ను అమలు చేస్తామని స్పష్టమైన జీవో ఇచ్చినప్పటికీ, దానిని క్షేత్రస్థాయిలో అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ప్రభుత్వం చర్చల పేరుతో కేవలం సంప్రదింపులు జరుపుతుందే తప్ప, మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి ఎలాంటి ముందడుగు వేయడం లేదు. ఇచ్చిన హామీ ప్రకారం జీవోను తక్షణమే అమలు చేయాలి." అని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు.
జూనియర్ డాక్టర్ల బైక్ ర్యాలీ
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 14, 2026, 12:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)