ప్రజాశక్తి-మంగళగిరి : పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా మంగళగిరిలో సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్ న్యూ పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం మంగళగిరి పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మే నెలలో కేవలం 11 రోజుల్లో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నాలుగుసార్లు డీజిల్, పెట్రోల్ ధరలను పెంచడం జరిగిందని విమర్శించారు. మే నెలలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం ఈ రేట్లను పెంచడం జరిగిందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం తన 12 సంవత్సరాల పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని సాకుగా చూపి ప్రజలపై కోలుకోలేని విధంగా భారారు మోపుతున్నారని విమర్శించారు. ఈ ఖరీఫ్ సీజన్లో ఎరువుల ధరలు భారీగా పెరగడంతో పాటు కొరత తీవ్రమయ్యే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దేశంలో ధరలు పెరగడానికి అమెరికా ఇజ్రాయిల్ దేశాదినేతలేనని అన్నారు. ఆ నేతలతో నరేంద్ర మోడీ స్నేహం చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్ర నష్టం చేస్తున్నారని విమర్శించారు. దేశానికి నష్టం జరుగుతున్న యుద్ధాన్ని ఆపమని మాత్రం నరేంద్ర మోడీ చెప్పడం లేదని విమర్శించారు. ధరలు పెరగడం వలన దేశంలో నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని విమర్శించారు. చౌకగా ఆయిల్ దొరికే రష్యా నుండి కొనకుండా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిలిపివేసిందని అన్నారు. అమెరికా ఏది చెబితేది అది వినే స్థితిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. కేజీ బేసిన్ సమురులో రాష్ట్రానికి వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈమని అప్పారావు, సిపిఎం గుంటూరు జిల్లా నాయకులు ఎస్ ఎస్ చెంగయ్య, సిపిఎం సీనియర్ నాయకులు జెవి రాఘవులు, పిల్లలమర్రి బాలకృష్ణ, సిపిఎం మంగళగిరి మండల రూరల్ కార్యదర్శి యు దుర్గారావు, రూరల్ నాయకులు బి కోటేశ్వరి, వి భారతి, సిపిఎం మంగళగిరి పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వై కమలాకర్, ఎం బాలాజీ, పట్టణ నాయకులు ఎం నాగేశ్వరావు, ఎస్ గణేష్, సిపిఎం మండల నాయకులు సింహాద్రి సుమ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ సమీర్, పట్టణ కార్యదర్శి కే రాజకుమార్, సిపిఐ గుంటూరు జిల్లా సహాయ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, సిపిఐ మంగళగిరి పట్టణ కార్యదర్శి ఏ ప్రభాకర్, సిపిఐ నాయకులు నందం బ్రహ్మేశ్వరావు, పిల్లల మర్రి నాగేశ్వరరావు, చిన్ని సత్యనారాయణ, అహ్మద్ బేగ్, ఎం జేసుదాసు, బి శ్రీనివాసరావు, సిహెచ్ రంగా, డి దాసు, సిపిఐ ఎంఎల్ న్యూ నాయకులు కూరపాటి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంపుపై మంగళగిరిలో వామపక్షాల రాస్తారోకో..
09 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 09, 2026, 01:46 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)