ప్రజాశక్తి – పొన్నూరు: న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకుని పొన్నూరు సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో న్యాయ సేవా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పొన్నూరు జూనియర్ సివిల్ జడ్జి జి. రుక్మిణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. పేదలకు న్యాయ సేవలు అందించేందుకు లోక్ అదాలత్‌లు కృషి చేస్తున్నాయని తెలిపారు. ఆర్థిక స్థోమత లేని పేదలకు ఉచితంగా న్యాయ సలహాలు, సూచనలు అందించడంతో పాటు, అవసరమైన వారికి న్యాయవాదులను ఏర్పాటు చేయడంలో న్యాయ సేవాధికార సంస్థ ముందుంటుందని పేర్కొన్నారు. లోక్ అదాలత్‌ల ద్వారా కక్షిదారులు సమయం, డబ్బు వృథా కాకుండా తమ కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, అడ్వకేట్ గుమస్తాలు, మండల న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది, కోర్టు సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
పొన్నూరులో ఘనంగా న్యాయ సేవా దినోత్సవం
09 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 09, 2026, 11:58 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)