- 59 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం
ప్రజాశక్తి-మేడికొండూరు: రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణే లక్ష్యంగా మేడికొండూరు మండలంలోని అత్యంత సమస్యాత్మక గ్రామమైన మంగళగిరిపాడు (తురకపాలెం)లో గురువారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. తుళ్లూరు డీఎస్పీ టి. మురళీకృష్ణ పర్యవేక్షణలో చేపట్టిన ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 59 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాల పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. పోలీసుల తనిఖీలు ప్రశాంతంగా ముగియగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు.








కామెంట్‌లు (0)