శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తెనాలిలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్

27 అక్టోబర్, 2026

Postal ballot process begins in Tenali
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 12:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా) : మున్సిపల్ ఎన్నికల ఘట్టంలో తొలిగా పోస్టల్ బ్యాలెట్ వినియోగం ప్రారంభమైంది. ఎన్నికల విధులకు కేటాయించిన పురపాలక సంఘ పరిధిలో ఓటు హక్కు కలిగిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఉపయోగించుకునేందుకు స్థానిక మున్సిపల్ కార్యాలయం కౌన్సిల్ హాలులో అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. మంగళ, బుధ వారాలలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల విధులలో ఉన్న సిబ్బంది ఓటు హక్కును వినియోగించుకునేందుకు మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. వారికి పోస్టల్ బ్యాలెట్ వినియోగం ప్రక్రియపై అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి జె రామ అప్పలనాయుడు, ఎన్నికల అధికారులు అవగాహన కల్పించి బ్యాలెట్ పత్రాలను పంపిణీ చేస్తున్నారు. చైర్పర్సన్ అభ్యర్థికి, కౌన్సిలర్ అభ్యర్థికి వేరువేరుగా జారీ చేస్తున్న బ్యాలెట్ పత్రాలను, ఓటు వేసేందుకు ఉపయోగించే మూడు కవర్ల విధానాన్ని వారికి వివరించి, ఆ ప్రకారం ఓటు హక్కును వినియోగించుకునే విధంగా సిబ్బంది సహకరిస్తున్నారు. మున్సిపల్ పోలింగ్ లో తొలి ఓటును అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, తహశీల్దార్ కెవి గోపాలకృష్ణ వినియోగించుకున్నారు. ప్రక్రియ ను ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్