ప్రజాశక్తి-తెనాలి రూరల్ : నీట్ ప్రశ్నపత్రాలు లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా తలపెట్టిన విద్యాసంస్థల బందును విద్యార్థి సంఘాల నాయకులు విజయవంతంగా చేస్తున్నారు. స్థానిక బస్ స్టాండ్ కూడలివద్ద కెఎల్ యూనివర్సిటీకి సంబంధించిన బస్సులను అడ్డగించడంతో ఎ ఐ ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి త్రి టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. శుక్రవారం మరికాసేపట్లో జరగనున్న మెగా పేరెంట్స్ డే సందర్భంగా పలు ప్రభుత్వ పాఠశాలవద్ద కూడా విద్యార్థి సంఘాలు నిరసన తెలుపనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
విద్యార్థి సంఘాల నేతలు అరెస్ట్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 24, 2026, 10:19 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)