- పార్టీ నాయకులు, కార్యకర్తలకు మాజీ మంత్రి విడదల రజిని పిలుపు
ప్రజాశక్తి-చిలకలూరిపేట : రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతినాయకులు కార్యకర్త సమన్వయంతో పని చేయాలని మాజీ మంత్రి విడదల రజిని గురువారం నాడు పిలుపునిచ్చారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విడదల రజిని ఆధ్వర్యంలో పంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావే శంలో పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొని రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూ హాలు, కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా విడదల రజిని మాట్లాడుతూ.. రానున్న పంచాయతీ ఎన్నికలను పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ప్రతి గ్రామంలో పార్టీ ని మరింత బలోపేతం చేయడం తో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మండలాల్లోని ప్రతి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గతంలో జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీ టీసీ ఎన్నికలసందర్భంగ తెలుగు దేశం పార్టీ అధికారాన్ని అడ్డుపె ట్టుకుని చిలకలూరిపేట నియో జకవర్గంలో అరాచక రాజకీయాలకు పాల్పడిందని విడదల రజి ని విమర్శించారు. ఎంపీటీసీ ఎ న్నికల సమయంలో నామినేషన్లు దాఖలు చేయడానికి వెళ్లిన వైఎ స్సార్సీపీ అభ్యర్థులను నామి నే షన్ కేంద్రాల వద్ద తెలుగుదేశం పార్టీకి చెందిన వారు అడ్డుకుని, నామినేషన్లు వేయకుండా ఆటం కాలు సృష్టించారని ఆరోపించా రు.అదేవిధంగా మున్సిపల్ ఎన్ని కల సందర్భం గా పోలింగ్ బూత్ ల వద్ద రౌడీ మూకలతో దాడులు చేయించి, వైఎస్సార్సీపీ నాయ కులు, కార్యకర్తలపై భౌతిక దాడు లకు పాల్పడుతూ వారిని భయ భ్రాంతులకు గురిచేశారని, రిగ్గింగ్, దొంగ ఓట్లుతో గెలిచారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికార అండతో పోలీసు యం త్రాంగాన్ని తమ రాజకీయ ప్రయో జనాల కోసం ఉపయోగించు కుంటూ ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై ఒత్తిళ్లు, బెదిరింపులకు పాల్పడిందని విమర్శించా రు. ఎన్నికల్లో ప్రజల మద్దతుతో గెలవాల్సిన పార్టీ, అధికార బలాన్ని ఉపయోగించుకుని ప్రతిపక్షాన్ని అణచి వేయాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఇలాంటి దాడులు, బెదిరింపులు, అడ్డంకుల ద్వారా చిలకలూరిపేట నియోజకవర్గం లో ఒక చెడు రాజకీయ సంస్కృతికి తెరలేపారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకు ని రానున్న పంచాయతీ ఎన్నిక ల్లో పార్టీ శ్రేణులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి బెదిరింపులకు, ప్రలోభాలకు భ యపడకుండా ఐక్యంగా ముం దుకు సాగాలని సూచించారు. ప్రజాబలమే వైఎస్సార్సీపీకి అసలైన బలమని, ప్రజల విశ్వా సాన్ని చూరగొంటూ ప్రతి గ్రామంలో పార్టీ విజయానికి కృషి చేయాలని అన్నారు. మాజీ ము ఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అమలైన సంక్షేమ పథకాలను, అభివృద్ధి గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ విధానాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య లను ప్రజలకు వివరించడంతో పాటు ప్రజా సమస్యలపై నిరం తరం పోరాటం చేయాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. పంచాయతీ ఎన్నికలు గ్రామాల అభివృద్ధికి, ప్రజాస్వా మ్య పరిరక్షణకు ఎంతో కీలకమ ని, గ్రామస్థాయిలో ప్రజలకు అం దుబాటులో ఉండే నాయకత్వా న్ని ముందుకు తీసుకురావడమే తమ లక్ష్యమని విడదల రజిని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం, పోలీసు అధికారులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా వ్యవహరించి, అన్ని పార్టీల అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పిస్తూ రానున్న పంచాయతీ ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరారు. పార్టీలోని ప్రతి నాయకుడు, కార్యకర్త వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం సమష్టిగా పనిచేయాలి. ప్రజల అండదండలతో, కార్యకర్తల ఐక్యతతో రానున్న పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సత్తా చాటుతాం. ప్రజల పక్షాన నిలబడి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుతుంది అని విడదల రజిని స్పష్టం చేశారు.








కామెంట్లు (0)