ప్రజాశక్తి-చిలకలూరిపేట (గుంటూరు) : చిలకలూరిపేట మండలం దండమూడి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద విజయ డిజిటల్ బోర్డు తుఫాను కారణంగా ప్రక్కనే ఉన్న కాటుకూరి సువార్తమ్మ అనే ఆమెకు చెందిన చిల్లర దుకాణం పై విరిగిపడింది. ఆ విషయాన్ని పలుమార్లు విజయ డిజిటల్ వారికి చెప్పి సమాచారం ఇచ్చినా బోర్డును తొలగించలేదని కుటుంబ సభ్యులు శుక్రవారం ఆరోపించారు. గురువారం సాయంత్రం బోర్డును తొలగించే క్రమంలో విద్యుత్ సర్వీస్ వైరు బోర్డు కింద నలిగి తెగిపోవడంతో చూడకపోవటంతో ఆ వైర్ తగిలి షాక్కు గురైన సువార్తమ్మ అక్కడికక్కడే కుప్పకూలింది. ఆమెను రక్షించే ప్రయత్నంలో గుమ్మడిదల మాధవరావుకు కూడా విద్యుత్ షాక్ తగిలింది. ప్రక్కనే ఉన్న గ్రామస్తులు కర్రలతో మాధవరావును ప్రమాదం నుంచి తప్పించారు. అనంతరం సువార్తమ్మను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. భర్త గుండె జబ్బుతో సుమారుగా సంవత్సరం క్రితం చనిపోయారు. వారి కుటుంబానికి ఈ చిల్లర కొట్టే ఆధారమని కుటుంబ సభ్యులు తెలువుతున్నారు. విజయ డిజిటల్ యాజమాన్యం ముందుగానే బోర్డును తొలగించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని, మహిళ ప్రాణాలు కోల్పోయేదే కాదని కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు.
దండమూడిలో విషాదం.. కరెంట్ షాక్తో మహిళ మృతి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 06, 2026, 12:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)