బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజ్ఞాచారికి జాషువా సాహితీ పురస్కారం

1 గంట క్రితం

ప్రజ్ఞాచారికి జాషువా సాహితీ పురస్కారం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 07:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - తెనాలిరూరల్

తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన సాహితీరత్న డాక్టర్ నూతక్కి పూర్ణ ప్రజ్ఞాచారికి మహాకవి జాషువా సాహితీ పురస్కారం లభించింది. గుంటూరులోని బృందావన్ గార్డెన్స్‌లో మంగళవారం రాత్రి నిర్వహించిన జాషువా సాహితీ వారోత్సవాల్లో భాగంగా జాషువా పద్యానికి పట్టాభిషేకం కార్యక్రమంలో మహాకవి జాషువా సాహితీ పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజ్ఞాచారి సృష్టించిన సాహితీ సంపద విశిష్టమైనదని అన్నారు. తన ప్రతిభను గుర్తించి సత్కరించిన జాషువా సాహితీ పీఠానికి ప్రజ్ఞాచారి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు భాష ఉన్నంతకాలం జాషువా చిరంజీవిగా నిలుస్తారని అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ ప్రవచకులు గరికిపాటి గురజాడ, తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ డాక్టర్ రాయపాటి డేవిడ్ విల్సన్, మాజీ శాసనసభ్యులు లింగంశెట్టి ఈశ్వర రావు, జన చైతన్య రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ప్రముఖ కవి దేవరపల్లి ప్రభుదాస్ తదితరులు ప్రజ్ఞాచారిని అభినందించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్