ప్రజాశక్తి - పెదకాకాని
నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఇండియన్ సొసైటీ ఆఫ్ హీటింగ్, రెఫ్రిజిరేటింగ్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఇంజనీర్స్ (ఇష్రే) విద్యార్థి విభాగాన్ని ప్రారంభించినట్లు వివిఐటియూ ప్రో-ఛాన్సలర్ వాసిరెడ్డి మహదేవ్ తెలిపారు. విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక అనుభవాన్ని పెంపొందించడమే లక్ష్యంగా వివిఐటియూ, ఇష్రే ఛాప్టర్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరినట్లు చెప్పారు. ఇష్రే ఛాప్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ అనూష, వివిఐటియూ రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు ఇష్రే స్టూడెంట్ సర్టిఫికేట్ కోర్సులు అందించడం, హీటింగ్,వెంటిలేటింగ్, ఎయిర్ కండిషనింగ్ రంగాలలో పారిశ్రామిక సందర్శనలు (ఇండస్ట్రియల్ విజిట్స్) ఏర్పాటు చేయడం, సాంకేతిక సదస్సులు, నిపుణులచే వర్క్‌షాప్‌లు నిర్వహించడం,విద్యార్థులకు క్షేత్రస్థాయి అనుభవం కోసం ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో వివిఐటియూ రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, అకడమిక్ డీన్ డాక్టర్ కె.గిరిబాబు, మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ టి. శ్రీనివాసరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)