శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బాక్సింగ్‌‌ విజేతలకు తులసి ధర్మచరణ్‌ అభినందన

1 గంట క్రితం

బాక్సింగ్‌‌ విజేతలకు తులసి ధర్మచరణ్‌ అభినందన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 06:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ బాక్సింగ్ పోటీల్లో అండర్–14, అండర్–17 విభాగాల్లో పతకాలు సాధించిన గుంటూరు జిల్లా క్రీడాకారులను వేద సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తులసి ధర్మచరణ్ అభినందించి, ఆర్థిక సహాయం అందజేశారు. అండర్–14 బాలుర విభాగంలో సాయి శశాంక్ రావణ్ 48–50 కేజీల విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించారన్నారు. అండర్–17 బాలికల విభాగంలో కె.లాస్య 66–70 కేజీలు, ఎస్. వర్షిణి 75–80 కేజీల విభాగాల్లో స్వర్ణ పతకాలు కైవసం చేసుకోగా, డి. శ్రావణి 70–75 కేజీల బరువు విభాగంలో కాంస్య పతకాన్ని సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా ధర్మచరణ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన బాలికలు విశేష ప్రతిభ కనబరిచి, రాష్ర్ట స్థాయిలో పతకాలు సాధించటం అభినందనీయమన్నారు.

ప్రతిభావంతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.కార్యక్రమంలో జిల్లా శాప్ బాక్సింగ్ కోచ్ రామిశెట్టి విశ్వనాథ్, సీనియర్ బాక్సింగ్ క్రీడాకారుడు, న్యాయవాది జి.సతీష్ పాల్గొన్నారు.

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్