శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏఎన్‌యూ దూరవిద్య పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

09 నవంబర్, 2026

ఏఎన్‌యూ దూరవిద్య పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 07:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించనున్న పీజీ, యూజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య దిట్టకవి రామచంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

​

యూజీ ఐదో సెమిస్టర్, పీజీ నాలుగో సెమిస్టర్‌తో పాటు వివిధ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు, బీఎల్‌ఐసీ, ఎంఎల్‌ఐసీ వార్షిక, సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒకే సెషన్‌లో పరీక్షలు జరుగుతాయని తెలిపారు.

​

రాష్ట్రవ్యాప్తంగా 60 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. మొత్తం 13,700 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కూడా ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, ఇక్కడ సుమారు 500 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వెల్లడించారు.

​

విద్యార్థుల హాల్‌టికెట్లను ఇప్పటికే విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆచార్య రామచంద్రన్ తెలిపారు. ముందుగానే హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్