గురువారం, 12 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కక్ష సాధింపుతోనే అప్పిరెడ్డిపై అక్రమ కేసులు

2 గంటల క్రితం

కక్ష సాధింపుతోనే అప్పిరెడ్డిపై అక్రమ కేసులు
గుంటూరు జైలులో ములాఖత్‌ అనంతరం వైసిపి ఎమ్మెల్సీలు, నాయకులు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 10:03 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

గుంటూరు జైలులో ములాఖత్‌ అనంతరం వైసిపి ఎమ్మెల్సీలు, నాయకులు

గుంటూరు :

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా జైల్లో పెట్టారని పలువురు ఎమ్మెల్సీలు, వైసిపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జైలులో ఉన్న అప్పిరెడ్డితో వైసిపి నాయకులు గురువారం ములాఖత్‌ అయ్యారు. పరామర్శ అనంతరం ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, కల్పలతారెడ్డి, వరుదు కల్యాణి, చంద్రగిరి ఏసురత్నం, మాజీ మంత్రి అంబటి రాంబాబు తదితరులు మీడియాతో మాట్లాడారు. తోట త్రిమూర్తులు మాట్లాడుతూ పరిషత్‌ ఎన్నికల సమయంలో లేళ్ల అప్పిరెడ్డిపై అక్రమ కేసు పెట్టారని ఒక పథకం ప్రకారం జైలుకు పంపారని ఆరోపించారు. కొంత మంది పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, వారికి 2029 తరువాత తగిన రిటర్న గిఫ్టు తప్పదని అన్నారు. పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ ‌బాక్సుల తరలింపులో చోటుచేసుకున్న అక్రమాలను ప్రశ్నించినందుకు అక్రమ కేసుపెట్టారని, వెంగళాయపాలెం ఎంపిటిసి బ్యాలెట్ బాక్సుల్లో నల్లపాడు వద్ద బ్యాలెట్‌ బాక్స్ దించేశారని, ఇందుకు నిరసనగా వైసిపి కార్యకర్తలు రాస్తారోకో చేశారని, అక్కడికి వచ్చిన అప్పిరెడ్డితో పాటు పలువురిపై నాన్‌‌బెయిల్ బుల్‌ ‌కేసులు పెట్టారని వివరించారు. బ్యాలెట్ బాక్సులు పక్కదారి పట్టిస్తున్నవారి పై కేసులు పెడతారా?. అక్రమాలను ప్రశ్నించిన వారి పై కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. వరుదు కల్యాణి మాట్లాడుతూ అప్పిరెడ్డిని కేసుల్లో ఇరికిద్దామని రెండున్నరేళ్లుగా ప్రయత్నిస్తున్నారని ఇప్పుడు ఎన్నికల కేసుల్లో ఇరికించి జైలుకు పంపారని అన్నారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ అప్పిరెడ్డికి రక్షణ కల్పించలేనని జైలు సూపరింటెండెంట్ లెటర్ రాశారని, రక్షణ కల్పించలేకపోతే మీరెందుకు? గుడ్డి గుర్రం పళ్లు తోముతారా? బ్యాలెట్ బాక్సు ఎందుకు బస్సులో నుంచి కిందకు దించారు?. బ్యాలెట్ బాక్సు వెంట పోలీసులు ఎందుకు లేరు. ఇప్పటివరకూ ఒక్కరైనా సమాధానం చెప్పారా?. పట్టాభిపురం సిబ్బంది గంగా వెంకటేశ్వర్లుపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నా. బ్యాలెట్ బాక్సు పగలగొట్టి రిగ్గింగ్ కు పాల్పడిన టీడీపీ వారిపై కేసులు లేవు. తన సామాజిక వర్గానికి చెందిన కొమ్మినేని కోటేశ్వరరావుకు మేలు చేయాలని సీఐ ప్రయత్నించారు. ఖాకీ బట్టలేసుకున్న పోలీసులకు కులపిచ్చేంటి?. కోయ ప్రవీణ్, చెరుకూరి శ్రీధర్, గంగా వెంకటేశ్వర్లు, వంశీ కులపిచ్చితో కొట్టుకుచస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు తాడికొండ శ్రీదేవి, ఈచంపాటి ఆచారి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్