మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆక్వాన్‌ తుపాను కంట్రోల్‌ రూమ్ ఏర్పాటు

17 నవంబర్, 2026

ఆక్వాన్‌ తుపాను కంట్రోల్‌  రూమ్ ఏర్పాటు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 07:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - చేబ్రోలు

రాబోవు ఆక్వాన్ తుపాను తీవ్రత దృష్టిలో ఉంచుకొని కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తహశీల్దారు కె.శ్రీనివాస శర్మ మంగళవారం తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గుంటూరు జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ తుపాను ఉధృతి నేపథ్యంలో టెలికాన్ఫరెన్స్ ద్వారా మండల, గ్రామస్థాయిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాబోవు మూడు రోజులు తీవ్రమైన గాలితో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రజలు అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని, నిత్యావసర సరుకులు ముందుగానే తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలని, రైతులు పంటలకు జరిగే నష్టతీవ్రతను తగ్గించుకునే, విషయమై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తుపాను ప్రభావం ఎక్కువగా నుండే అవకాశాలు ఉన్నందున ప్రజలు దూర ప్రయాణాల్లో మానుకోవాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే చేబ్రోలు తహశీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలని సూచించారు . కంట్రోల్ రూమ్ నుండి సహాయ సహకారాలు అందించేందుకు మండల రెవెన్యూ అధికారి పి.శ్రీనివాసరావు ఇన్‌‌చార్జిగా నియమించినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ -8500513573.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్