పుష్పలీల మృతదేహానికి సిపిఎం రాష్ట్ర, జిల్లా, డివిజన్ నాయకుల నివాళులు
ప్రజాశక్తి – మంగళగిరి రూరల్ : సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి, పార్టీ జిల్లా సెక్రటేరియట్ సభ్యులు ఎం.రవి భార్య పుష్పలీల సోమవారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. పుష్పలీల మృతదేహానికి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి. రమాదేవి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్. బాబురావు, నాయకులు ఉమామహేశ్వరరావు, ధనలక్ష్మి, వి. వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వై. నేతాజీ, పాశం రామారావు, ఈమని అప్పారావు, బి. లక్ష్మణరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనసేన, వైఎస్సార్సీపీ నాయకులు సైతం పుష్పలీల మృతదేహానికి నివాళులర్పించి, ఎం. రవి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.










కామెంట్లు (0)