శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉపాధ్యాయ సమస్యలపై శక్తివంచన లేకుండా కృషి

13 నవంబర్, 2026

ఉపాధ్యాయ సమస్యలపై శక్తివంచన లేకుండా కృషి
పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎం.హనుమంతరావు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 08:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎం.హనుమంతరావు

ప్రజాశక్తి - గుంటూరు : విద్యారంగం, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అన్ని రంగాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ​కృష్ణా-గుంటూరు ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎం.హనుమంతరావు చెప్పారు. ఉపాధ్యాయ, అధ్యాపక, ఇతర సంఘాలు బలపరిచిన ఆయన శుక్రవారం వినుకొండ, నూజెండ్ల మండలాల్లో పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయులతో సమావేశమై మాట్లాడారు. ​విద్యారంగంలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం శాసనమండలి వేదికగా పోరాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ​ఉపాధ్యాయుల హక్కులు, సమస్యల పరిష్కారం పట్ల రాజీలేని పోరాటం సాగిస్తానని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో నీతి, నిజాయితీ, విలువలతో పనిచేసే అభ్యర్థిగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. శాసన మండలిలో, ప్రజా పోరాటాల్లో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు చేస్తున్న కృషిని వివరించారు. ​కార్యక్రమంలో యుటిఎఫ్‌ ‌పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాసరెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు ఎ.నాగేశ్వరరావు, జి.నాగేంద్రుడు, పి.రాజ్యలక్ష్మి, వి.లక్ష్మీసామ్రాజ్యం, సిఐటియు నాయకులు బి.వెంకటేశ్వర్లు, వెంకటప్పయ్య పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్