జిఒ నంబర్ 396 ఉపసంహరించాలని డిమాండ్
ప్రజాశక్తి-కాకినాడ : దస్తావేజు లేఖరుల పొట్ట కొట్టే విధంగా ప్రభుత్వం జారీ చేసిన జీ వో నంబర్ 396 ను తక్షణం ఉప సంహరించుకోవాలని దస్తావేజు లేఖరులు డిమాండ్ చేశారు. తమ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ... లేఖరులు చేస్తున్న నిరసన బుధవారానికి మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంఘం నేత వీ జే.ప్రసాద్ మాట్లాడుతూ .... రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షలమంది లేఖరులు ఉన్నారన్నారు. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసే ఆర్ ఎస్ కే లు వల్ల, అందరి కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఏడాదికి రెండు కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని, దానితో అభివృద్ధి చేయాలని సూచించారు. సీనియర్ లేఖరి దేవాళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ .... తాము ఒక్కో రిజిస్ట్రేషన్ కు ఎంతో కష్టపడి పేపర్ వర్క్ చేస్తామని, సర్వే పనులు నిర్వహించి డాక్యుమెంట్ తయారు చేస్తామని తెలిపారు. రెండు రోజులపాటు కష్టపడితే 2000 రూపాయలు ఇస్తారని, దీనిలో డిటిపి, ఆఫీస్ అద్దెలు కూడా చెల్లించాలని తెలిపారు. తాము ఇదే పనిపై ఆధారపడి 200 మంది కాకినాడ లో పనిచేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఉన్న పళంగా బయటకు పొమ్మంటే తమ కుటుంబాలు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ లు చొరవ తీసుకుని జీ వో రద్దు చేయించాలని విజ్ఞప్తి చేశారు. నిరసనలో కాకినాడ దస్తావేజు లేఖరులు సంఘం కార్యదర్శి గీసాల శ్రీనివాస్ రావు, మేడిశెట్టి శ్రీను తో పాటు పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)