శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అధ్వానంగా పారిశుధ్య నిర్వహణ - పట్టించుకోని ప్రత్యేక అధికారులు

31 జులై, 2026

Abysmal sanitation management – ​​Special officers indifferent
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 11:51 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రౌతులపూడి (కాకినాడ) : పరిసర ప్రాంతాల పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని అధికారులు, ప్రజాప్రతినిధులు వేదికలపై ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు అయితే ఆచరణలో మాత్రం అవి కనిపించవు దీనికి ఉదాహరణ మండల కేంద్రమైన రౌతులపూడిలో ఆర్ అండ్ బి రహదారిపై ఉన్న మురికి నిదర్శనం ఈ గ్రామానికి చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు పలు అవసరాల రీత్యా నిత్యం రవాణా చేస్తూ ఉంటారు పలు ప్రభుత్వ కార్యాలయాలు పని కోసం మరియు వివిధ గ్రామాల్లో రైతులు పండించిన కూరగాయల సాగును మార్కెట్లో అమ్ముకునేందుకు నిత్యం మండల కేంద్రమైన రౌతులపూడి రావాల్సిందే అలాంటి ప్రాంతం పరిశుభ్రంగా ఉండవలసింది పోయి అపరిశుభ్రంగా ఉండడంతో రైతులు , వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజా ప్రతినిధుల స్థానంలో ప్రత్యేక అధికారులు పాలన వచ్చిన తర్వాత గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ ఆటకెక్కిందని అంతా అనుకుంటున్నారు అసలే సీజనల్ వ్యాధులు ప్రబలే తరుణంలో పారిశుధ్య నిర్వహణ పనులు చేపట్టకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు స్థానిక కనకదుర్గ గుడి నుండి మార్కెట్ సెంటర్ వరకు రహదారి బురదమయంగా మారడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు ఇప్పటికైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని పారిశుధ్య నిర్వహణ పనులు చేపట్టాలని కోరుతున్నారు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్