ప్రజాశక్తి-కాకినాడ : స్థానిక ఆదిత్య డిగ్రీ, పీజీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) జాతీయ సేవా పథకం వాలంటీర్లు వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ - 2027 రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆదిత్య డిగ్రీ, పీజీ కళాశాలల అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ బిఈవిఎల్ నాయుడు తెలిపారు. ఆదిత్య డిగ్రీ కళాశాలలో బి సి ఎ డేటా సైన్స్ తృతీయ సంవత్సరం చదువుతున్న ఉప్పరపల్లి గని లక్ష్మి, బి ఎస్సి డేటాసైన్స్ ప్రథమ సంవత్సరం చదువుతున్న చక్రవర్తుల అమృత వర్షిని వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ - 2027" రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మొదటి రెండు దశలు ఆన్లైన్లో నిర్వహించగా మూడవ దశ జిల్లా స్థాయి చాంపియన్షిప్ పోటీలు జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో సీఈవో కాశీ విశ్వేశ్వర రావు అధ్యక్షతన పి ఆర్ కళాశాలలో జరిగాయి. ఈ పోటీలలో జిల్లా స్థాయిలో 6గురు సభ్యులు రాష్ట్రస్థాయికి ఎంపిక కాగా వారిలో ఇద్దరు ఆదిత్య డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు ఎంపిక అయ్యారు. జిల్లా స్థాయిలో ఎంపికైన విద్యార్థులకు డిసెంబర్ 7వ తేదీలోగా రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ నాయుడు మంగళవారం ప్రజాశక్తితో మాట్లాడుతూ ... విద్యార్థులు భావిభారత రథసారథులని, అన్ని రంగాలలో రాణించాలని అన్నారు. సేవా కార్యక్రమాలతో పాటు విద్యా సాంస్కృతిక సాంకేతిక రంగాలలో ఎన్ఎన్ ఎస్ విద్యార్థులు ముందు ఉండడం అభినందనీయమన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విజేతలను అభినందించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని అన్నారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్ పోటీలకు ఎంపికైన విద్యార్థులను ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, డిగ్రీ కళాశాలల సెక్రెటరీ డాక్టర్ నల్లమిల్లి సుగుణా రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ సి. సత్యనారాయణ, ఎన్ఎస్-ఎస్ ప్రోగ్రాం అధికారులు టి. తేజేశ్వరరావు, అశ్విని, ఆంగ్ల అధ్యాపకులు జి సరోజ అభినందించారు.
వికసిత్ భారత్ రాష్ట్రస్థాయి పోటీలకు ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థుల ఎంపిక
8 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 17, 2026, 04:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)