ప్రజాశక్తి - జగ్గంపేట : మండలంలోని బావవరం ఏలేరు ప్రాజెక్ట్ లో గల్లంతైన విద్యార్థి మృతదేహం గురువారం లభ్యమైంది. గండేపల్లి మండలం సురంపాలెం ప్రైవేట్ కళాశాలలో డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఏలేరు ప్రాజెక్ట్ వద్దకు విహార యాత్రకు వెళ్లారు. వారిలో వడ్డి ప్రశాంత్ (19) స్నానానికి వెళ్లి ప్రమాదపుశాత్తు మునిగిపోయాడు. బుధవారం సాయంత్రం నుండి రాత్రి వరకూ గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి కావడంతో నిలిపివేసి, గురువారం ఉదయం తిరిగి గాలింపు చేపట్టగా మృతదేహంగా లభ్యమైంది. మృతదేహాన్ని జెడ్ రాగంపేట ఆసుపత్రికి పోస్టుమార్టానికి తరలించారు. జగ్గంపేట ఎస్ఐ రఘునాథరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏలేరు ప్రాజెక్ట్ లో గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం
06 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 06, 2026, 02:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)