ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో శనివారం స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటడంతో పాటు, పరిసరాలను పరిశుభ్రపరిచే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) డా. మహంతి కిషోర్ కుమార్, అడిషనల్ ఎస్పీ (ఏఆర్) ఎస్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో మొక్కల పెంపకం ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతను వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించి, ఆరోగ్యకరమైన వాతావరణం కోసం సమిష్టిగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్బి డిఎస్పీ కెవివి సత్యనారాయణ, ట్రాఫిక్ వన్ ఇన్స్పెక్టర్ ఎన్ రమేష్, ట్రాఫిక్ 2 ఇన్స్పెక్టర్ డి రామారావు, కాకినాడ రెండవ పట్టణ ఇన్స్పెక్టర్ ఎం అప్పలనాయుడు, కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ డి చైతన్య కృష్ణ, పోర్ట్ ఇన్స్పెక్టర్ పి సునీల్ కుమార్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ టి దుర్గాప్రసాద్, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ వి శ్రీనివాసరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎం నరసింహ మూర్తి, ఎస్సైలు, ఆర్ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసు పరేడ్ మైదానంలో మొక్కలు నాటి, పరిసరాలను పరిశుభ్రం చేసిన జిల్లా ఎస్పీ
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 12:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)