గురువారం, 08 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కాకినాడ ఎస్డీపీవోగా దుర్గారావు బాధ్యతల స్వీకరణ

1 గంట క్రితం

కాకినాడ ఎస్డీపీవోగా దుర్గారావు బాధ్యతల స్వీకరణ
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026, 04:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కాకినాడ: కాకినాడ సబ్‌ డివిజనల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ (ఎస్డీపీవో)గా ఎన్‌.ఎస్‌.వి.కె. దుర్గారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ నూతన ఎస్డీపీవోకు శుభాకాంక్షలు తెలిపారు.

దుర్గారావు గతంలో విజయవాడ వెస్ట్‌ జోన్‌ ఏసీపీగా పనిచేశారు. ఇప్పటివరకు కాకినాడ ఎస్డీపీవోగా అదనపు ఎస్పీ (అడ్మిన్‌) డాక్టర్‌ మహంతి కిషోర్‌కుమార్‌ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహించారు. కాకినాడ సబ్‌ డివిజన్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు వేగవంతమైన, మెరుగైన పోలీసు సేవలు అందించాలని ఎస్పీ సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్