- ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ
ప్రజాశక్తి-కాకినాడ : పర్యావరణ పరిరక్షణకు సమాజాన్ని భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో చేయూత చారిటబుల్ సొసైటీ, కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించిన 10 వేల సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం కాకినాడలోని చేయూత చిల్డ్రన్ హోమ్ ప్రాంగణంలో ఘనంగా, విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాకినాడ డివిజన్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (డీఎఫ్ఓ) ఎన్. రామచంద్రరావు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని అభినందించారు. విద్యార్థులు, యువత, ప్రకృతి ప్రేమికులు, స్వచ్ఛంద సేవకులు, వివిధ రంగాల ప్రతినిధులు, చేయూత సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా సీడ్ బాల్స్ తయారీలో భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, ఇలాంటి కార్యక్రమాలు పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు భవిష్యత్ తరాలకు పచ్చని వారసత్వాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. చేయూత చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ఎం. రవి కుమార్ మాట్లాడుతూ ఒక సీడ్ బాల్... ఒక చెట్టు... ఒక పచ్చని భవిష్యత్తు అనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముఖ్య అతిథులు, అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, దాతలు, సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, విద్యార్థులు, మీడియా ప్రతినిధులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తయారు చేసిన సీడ్ బాల్స్‌ను వర్షాకాలంలో అనువైన ప్రాంతాల్లో విస్తరించి పచ్చదనాన్ని పెంపొందించేందుకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.








కామెంట్‌లు (0)