శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి...

15 నవంబర్, 2026

నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 05:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-యు.కొత్తపల్లి : పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిఠాపురం సిఐ జివివి సత్యనారాయణ అన్నారు. యు.కొత్తపల్లి మండలంలోని అతి సమస్యాత్మక గ్రామంగా గుర్తించిన శ్రీరాంపురంలో ఆదివారం పోలీసులు అవగాహన సమావేశం నిర్వహించారు. పిఠాపురం సిఐ జివివి సత్యనారాయణ, యు.కొత్తపల్లి ఎస్ఐ జి.వెంకటేష్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎలాంటి నేరాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగకుండా కుల, మత, వర్గాలకు అతీతంగా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు. గ్రామంలో రాజకీయ విభేదాలు, ఘర్షణలకు తావివ్వకుండా సంయమనం పాటించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్