సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తండ్రి పేరు ఆ బాలల భవిష్యత్తుకు ఆటంకం కాకూడదు

1 గంట క్రితం

kakinada-2
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 03:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కాకినాడ : తండ్రి పేరుతో గుర్తింపు పత్రాలు కొందరు చిన్నారులకు అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమీషన్ సభ్యులు ఉండవల్లి గాంధీబాబు అన్నారు. ఇదే అంశంపై ఈ నెల 7న బెంగళూరులో జరగనున్న జాతీయ స్థాయి సమావేశానికి హాజరుకానున్నానని వెల్లడించారు. సోమవారం కాకినాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కర్ణాటక న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తనకు ఆహ్వానం అందిందన్నారు. తండ్రి పేరుతో గుర్తింపు పత్రాలు అనేది జాతీయ స్థాయిలో కొందరు చిన్నారులు ఎదర్కొంటున్న సమస్య అని వివరించారు. దేశ వ్యాప్తంగా కొందరు చిన్నారులకు జనన ధృవీకరణ పత్రం, గుర్తింపు, పేరు, విద్య వంటి విషయాల్లో తండ్రి పేరు పెద్ద ఆటంకంగా మారిందన్నారు. తండ్రి పేరు ఏంటన్న ప్రశ్నకు కొంతమంది చిన్నారుల్లో సమాధానం దొరకని ప్రశ్నగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. ఇటువంటి బాలలు తమ భవిష్యత్తుకు అవసరమైన తొలి అడుగు వేసే సమయంలోనే “నీ తండ్రి ఎవరు” అన్న ప్రశ్న దగ్గర ఆగిపోతున్న పరిస్థితులు ఉండటం విచారకరమన్నారు. స్కూల్ రికార్డులు, దరఖాస్తులు, గుర్తింపు పత్రాలు, ప్రభుత్వ పథకాలు వంటి అంశాలతో పాటు, చట్టం అడిగిన చోట కూడా తండ్రి పేరు ఉండాలా అన్న ప్రశ్న అనేక మంది చిన్నారుల జీవితాలను చీకటిలోకి నెట్టి వేయడం ఆవేదన కలిగించే అంశం అని అభిప్రాయపడ్డారు. ఈ నెల 7 న బెంగుళూరు లో జరిగే సమావేశంలో తన దగ్గర ఉన్న సమాచారాన్ని అన్ని రాష్ట్రాల ప్రతినిధుల దృష్టికి తీసుకువెళతానని తెలిపారు. రాజ్యాంగం లో బాలల హక్కులు, సుప్రీం కోర్టు తీర్పు తదితర అంశాలను సమావేశంలో వివరించనున్నట్టు తెలిపారు. తండ్రి గుర్తింపు వల్ల అనేక మంది చిన్నారులు భవిష్యత్తు ప్రశ్నార్ధకం కాకూడదని, బాలల హక్కులపై అవగాహన ఉన్న తాను పూర్తిగా ఇటువంటి దురాచారాన్ని రూపు మాపేందుకు కృషి చేస్తానని ఉండవల్లి గాంధీబాబు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్