ప్రజాశక్తి -యు.కొత్తపల్లి(కాకినాడ) : మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నాగులాపల్లి నుంచి రమణక్కపేట, రావివారిపోడు, శ్రీరాంపురం తదితర గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి ముంపునకు గురవుతోందని గ్రామస్తులతో కలిసి సిపిఎం నాయకులు ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ, ఎస్సీ పేటలను ఆనుకుని ఉన్న ఈ రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రతి వర్షాకాలంలో ఏళ్లుగా ఇదే పరిస్థితి పునరావృతమవుతున్నా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదన్నారు. ముంపు ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని నాగులాపల్లి గ్రామ సిపిఎం కమిటీ, గ్రామ ప్రజలు డిప్యూటీ సిఎం పవన్‌కళ్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జి. అప్పారెడ్డి, కె. నాగేశ్వరరావు, కె.వి.వి. సత్యనారాయణ, జి.వి. సుబ్బిరెడ్డి, సిహెచ్. నారాయణరెడ్డి, ఏ. వాసు, ఎం. తదితరులు పాల్గొన్నారు.
రహదారిపై వరదనీరు.. బ్రిడ్జి నిర్మించాలని సిపిఎం ధర్నా
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 11:43 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)