ప్రజాశక్తి-కాకినాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అద్దంకి వెంకన్న బాబును కాకినాడ జిల్లా బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుత్తుల వీరబ్రహ్మం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తిలో విశేష కృషి చేసి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకోవడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు సృజనాత్మక పద్ధతుల్లో, మట్టి బొమ్మల తయారీ వంటి కళాత్మక విధానాలతో బోధన అందించడం వెంకన్న బాబు ప్రత్యేకత అన్నారు. భవిష్యత్తులో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో పాటు మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా అధ్యక్షులు వాసంశెట్టి కామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి జోగా రామకృష్ణలు పుష్పగుచ్ఛం, మెమెంటో, శాలువాతో వెంకన్న బాబును సత్కరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు సుధాకర్‌రావు, గంటి రాధాకృష్ణ, నక్కా వెంకటేశ్వరరావు, చింతాడ ప్రదీప్‌కుమార్, వంచర్ల వీరభద్రరావు, కడలి నాగరాజు, ములంపాక శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు అద్దంకి వెంకన్న బాబుకి ఘన సన్మానం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 05, 2026, 02:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)