సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రయాణికురాలి బంగారు ఆభరణాల బ్యాగ్‌ అప్పగింత

30 ఆగస్టు, 2026

Handing over of a female passenger's bag containing gold jewelry.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 03:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కాకినాడ : నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ ప్రయాణికురాలు మర్చిపోయిన బంగారు ఆభరణాలున్న బ్యాగ్‌ను భద్రంగా తిరిగి అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. విజయవాడ–కాకినాడ బస్సులో ప్రయాణించిన ఓ మహిళా ప్రయాణికురాలు కాకినాడ వైఎస్సార్‌ సర్కిల్‌ వద్ద దిగిన తర్వాత బ్యాగ్‌ను బస్సులోనే మర్చిపోయినట్లు గుర్తించారు. దీంతో ఆమె వెంటనే కాకినాడ డిపోకు చేరుకుని సిబ్బందికి విషయం తెలిపారు. డిపో సిబ్బంది సంబంధిత బస్సును తనిఖీ చేయగా బ్యాగ్‌ లభించింది. అందులో సుమారు రెండు తులాల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. బస్సు డ్రైవర్‌ బిఎస్‌ఎస్‌ వాసు, భద్రతా సిబ్బంది, విధుల్లో ఉన్న నియంత్రణాధికారి సమక్షంలో బ్యాగ్‌ను సంబంధిత మహిళకు అప్పగించారు. విలువైన వస్తువులను భద్రంగా కాపాడి, ఎలాంటి స్వార్థం లేకుండా తిరిగి అప్పగించిన డ్రైవర్‌ వాసు నిజాయితీ, నిబద్ధతను డిపో మేనేజర్‌, సహాయ మేనేజర్‌ అభినందించారు. ప్రయాణికుల వస్తువుల భద్రత విషయంలో ఆర్టీసీ సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న తీరుకు ఈ ఘటన నిదర్శనమని వారు పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్