గురువారం, 23 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పోగొట్టుకున్న సెల్ ఫోన్లు అందజేత

3 రోజుల క్రితం

Handing over of lost cell phones
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 04:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - యానాం (కాకినాడ) : ఇటీవల కాలంలో పోగొట్టుకున్న చరవాణులను యానాం ఎస్పీ వరదరాజన్ తన కార్యాలయంలో సోమవారం బాధితులకు అందజేశారు.చరవాణులు పోగొట్టుకున్న వారు ఆందోళన చెందవద్దని,స్థానిక పోలీస్ స్టేషన్లో సైబర్ హెల్ప్ డెస్క్ లో ఫిర్యాదు చేస్తే ఆన్లైన్ పోర్టల్  ద్వారా కనుక్కొని తిరిగి అప్ప చెప్పడం జరుగుతుందని ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో సూచించారు. యానాం పరిధిలో 6 నెలల కాలంలో సుమారు 70 ఫోన్లు పోగొట్టుకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు.దానిలో 40 ఫోన్లు గుర్తించి వారందించిన ఫిర్యాదుల మేరకు ప్రత్యేక పోర్టల్ ద్వారా వాటి జాడ కనుక్కొని బాధితులకు అందించారు.వాటి విలువ రూ. 8 లక్షల 90 వేలు ఉంటాయని తెలిపారు.తమిళనాడులో తుత్తుకూడి,నక్కపల్లి,విశాఖపట్నం, తాడేపల్లిగూడెం,హైదరాబాద్,గోకవరం,కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో సెల్ఫోన్లను గుర్తించి  రికవరీ చేశామన్నారు.మొబైల్ ఫోన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.మొబైల్ బిల్స్, ఐఎంఈఐ నెంబర్లను జాగ్రత్త పరచుకోవాలన్నారు.ఈ సందర్భంగా పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.అదేవిధంగా సైబర్ కమాండో యడ్ల శాంతి, క్రైమ్ టీమ్ పి వి మూర్తి,డి సూర్య ప్రకాశరావు,పి కృపానందం లను ఎస్పీ అభినందించారు.ఈ కార్యక్రమంలో సిఐ డి.సురేష్ బాబు,ఎస్ హెచ్ఓ కౌమర్,ట్రాఫిక్ ఎస్ ఐ తిరువనక్కరాసు,ఎస్సైలు ఇలంగో,కవల రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్