శనివారం, 11 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఐ ఆర్ వెంటనే ప్రకటించాలి : పెన్షనర్ల సంఘం

2 గంటల క్రితం

IR must be announced immediately: Pensioners' Association
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 04:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - జగ్గంపేట (కాకినాడ) : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పిఆర్సి కమిటీ నియమించి ఐ ఆర్ ను ప్రకటించాలని పెన్షనర్ల సంఘం అధ్యక్షులు తొలేటి సూర్యనారాయణ డిమాండ్ చేశారు. స్థానిక విశ్రాంతి ఉద్యోగుల సంఘ భవనం వద్ద శనివారం ఆ సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగ , ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీల అధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులకు, ఎంఎల్ఎ, ఎమ్మెల్సీలకు , కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. దానిలో భాగంగా రాష్ట్ర జెఎసి సభ్యులను సిఎం చంద్రబాబు చర్చలకు పిలిచారని తెలియజేశారు. చర్చలు ద్వారా సమస్య పరిష్కారం అవుతుందనే ఆశాభావంతో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఎం మల్లేశ్వరరావు, సభ్యులు హెచ్ వి ఆర్ జ్యోషి, చంద్రమౌళి వెంకట శాస్త్రి, మామిడి చంద్రరావు , పడాల వీర వెంకట సత్యనారాయణ, గోన చక్ర రావు, సి.హెచ్ సూర్యప్రకాశరావు , డి వి వి ప్రసాద్, సలాది వెంకటేశ్వరరావు, సి.హెచ్ సత్యనారాయణ , ఎం వివి మూర్తి , యం. రామలింగేశ్వరరావు , తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్