ప్రజాశక్తి-కాకినాడ : జిల్లా వ్యాప్తంగా ఉన్న పారామెడికల్ విద్యార్థులు మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పారామెడికల్ విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం గంగా సూరిబాబు, కాకినాడ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి సత్యం, సిహెచ్ లోవరాజులు మాట్లాడుతూ.. పారామెడికల్ విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. ప్రతి పారామెడికల్ విద్యార్థికి నెలకు పదిహేను వేల స్టైఫాండ్ అందించాలని, మూడు సంవత్సరాల కోర్సును ఆరు సంవత్సరాలకు పొడిగించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని అన్నారు. పారామెడికల్ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి స్పష్టమైన పరిష్కారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పారామెడికల్ విద్యార్థుల విద్యా భవిష్యత్తు ప్రయోజనాలకు ప్రభుత్వం పూర్తి భరోసా కల్పించాలని, విద్యార్థులందరికీ ఉండడానికి హాస్టల్, ఇతర వసతులు అన్ని కల్పించాలని, ఈ సమస్యల పై ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం డిఆర్ఓ డా. తిప్పే నాయక్ కు సమస్యలపై వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కే సిద్దు, నగర అధ్యక్షులు డి మణికంఠ, పారామెడికల్ విద్యార్థులు, జాయిస్, కృష్ణ, జగదీష్, పార్వతి, శరణ్, భవ్య, తదితరులు పాల్గొన్నారు.
పారా విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి : ఎస్ఎఫ్ఐ
15 సెప్టెంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 15, 2026, 05:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)