నరసన్నపేట (శ్రీకాకుళం జిల్లా) : కెవిఆర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు దగ్ధమైన ఘటన శనివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో జరిగింది. నరసన్నపేట మండలం జమ్ము జంక్షన్ వద్ద బస్సు బ్యాక్ వీల్ పేలి రోడ్ రాపిడ్ వల్ల లోపల భాగం నుండి మంటలు చెలరేగడంతో కెవిఆర్ బస్సు కాలిపోయింది. ఈ బస్సు కొత్త గూడెం (భద్రాచలం ) నుండి పలాసకు వెళుతుండగా, మార్గమధ్యంలో నరసన్నపేట దగ్గర జమ్ము జంక్షన్ వద్ద ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయములో బస్సులో ఐదుగురు ప్రయాణికలు, డ్రైవర్, కండక్టర్ ఉన్నారు.అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదము జరగలేదు. అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను అదువు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కెవిఆర్ ట్రావెల్స్ బస్సు దగ్ధం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 12:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)