శనివారం, 22 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజాదర్బార్ లో వినతులు స్వీకరించిన ఎంఎల్ఎ

1 గంట క్రితం

MLA receives representations at the public grievance meeting.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 22, 2026, 03:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - జగ్గంపేట (కాకినాడ) : స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ లో ఎంఎల్ఎ జ్యోతుల నెహ్రు శనివారం ప్రజల నుండి వినతులు స్వీకరించారు. పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, గృహ రుణాలు తదితర సమస్యలపై ప్రజలు వినతులు అందజేశారు. కాట్రావులపల్లిలో ఫిల్టర్ వాటర్ అందించేందుకు 24 గంటలు విద్యుత్ ను అందించాలని గ్రామ టిడిపి అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఎంఎల్ఎ కు విన్నవించారు. వెంటనే ఆయన విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, పిల్లా చంటిబాబు, రేఖ బుల్లి రాజు, పురం శెట్టి శివాజీ, వేములకొండ జోగారావు, పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్