ప్రజాశక్తి-యు.కొత్తపల్లి (కాకినాడ) : కొత్తపల్లి మండలం అమినాబాదు గ్రామంలో కోతుల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. గుంపులుగా గ్రామంలోకి ప్రవేశిస్తున్న కోతులు ఇళ్లపైకి ఎక్కి ఇంటి సామగ్రిని చిందరవందర చేయడంతో పాటు వస్తువులను ధ్వంసం చేస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారులు, వీధుల్లో కోతులు గుంపులుగా సంచరిస్తుండటంతో చిన్నారులు, వృద్ధులు భయాందోళనకు గురవుతున్నారు. రోడ్లపై కోతుల సంచారంతో వాహనదారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోనపాపేట సమీపంలోని ఎస్‌ఈజెడ్ భూముల్లో చెట్లను నరికివేయడం వల్ల ఆవాసం, ఆహారం కొరత ఏర్పడి కోతులు గ్రామంలోకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కోతులను పట్టుకుని అటవీ ప్రాంతాలకు తరలించి, ప్రజలకు ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అమినాబాదులో కోతుల బెడద
17 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 11:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)