ప్రజాశక్తి - జగ్గంపేట : వర్షబావ పరిస్థితులను ఎదుర్కొనే విధంగా రైతులను సమాయత్తం చేయాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు జి. శ్రీనివాస్ సూచించారు. మంగళవారం స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద జగ్గంపేట డివిజన్ పరిధిలోని విఏఏ లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరిసాగుకు రైతులకు అవసరమయ్యే ఎరువులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అలాగే ఈఏడాది వర్షాలు తక్కువగా ఉంటాయని, దీంతో వెదజల్లే పద్ధతిని ప్రోత్సహించవద్దని నాట్లు వేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. ఈ సమావేశంలో జగ్గంపేట, గండేపల్లి, ఏలేశ్వరం, ఏఓలు ఎస్. నరసింహం, జె .లక్ష్మీ, ఎ వి రాజేష్, పిఎటు ఎడిఎ జి బి కరుణాకరరాజు, తదితరులు పాల్గొన్నారు.
వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొవాలి - ఏడిఏ
14 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 14, 2026, 04:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)