శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

10 వరకు జాతీయ న్యాయ సేవా దినోత్సవ వారోత్సవాలు

1 గంట క్రితం

10వ తేదీ వరకు జాతీయ న్యాయ సేవా దినోత్సవ వారోత్సవాలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 06:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పెద్దాపురం : జాతీయ న్యాయ సేవా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఈ నెల 10వ తేదీ వరకు పెద్దాపురం కోర్టుల పరిధిలోని పలు మండలాల్లో ప్రజలకు చట్టాలపై విస్తృతంగా అవగాహన కల్పించనున్నట్లు న్యాయవాది మడికి రాంబాబు తెలిపారు. శుక్రవారం స్థానిక ఎన్టీఆర్ కాలనీలో నిర్వహించిన చట్టాలపై అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ నెల 9వ తేదీన జరిగే జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దాపురం, రంగంపేట, గండేపల్లి, జగ్గంపేట మండలాల్లో ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. రాంబాబు మాట్లాడుతూ డిసెంబర్ 12వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్న కక్షిదారులు, న్యాయవాదులు, సాధారణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. న్యాయవాదులు సకురు దుర్గారావు, శిలపరశెట్టి విశాలాక్షిలు మాట్లాడుతూ మహిళలకు చట్టసభలు కల్పించిన వివిధ రక్షణ చట్టాలను, హక్కులను ప్రజలకు వివరించారు. మహిళలు తమ హక్కులపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్లు నూతలపాటి అప్పలకొండ, కెవివి లక్ష్మి, ఎన్.శ్రీహర్ష, ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్