ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ కచేరీపేట నందు గల యూటిఎఫ్ భవనంలో సీనియర్ నాయకుడు ఐ.ప్రసాదరావు తన సొంత నిధులతో సుమారు 30 వేల రూపాయలు పైబడి ఖరీదు చేసే సుందరమైన పోడియం ను ఆదివారం బహుకరించారు. జిల్లా యూటిఎఫ్ అధ్యక్షుడు సూరిబాబు నిర్వహించిన యూనియన్ కార్యక్రమంలో పోడియంను ఐ.ప్రసాదరావు అందజేశారు. రాష్ట్ర కార్యదర్శి చక్రవర్తి, పూర్వపు రాష్ట్ర కార్యదర్శి ప్రభాకరవర్మ పోడియంను ఆవిష్కరించారు. గత ముప్ఫై ఆరు సంవత్సరాలుగా యూటిఎఫ్ సంఘానికి అనేక అవసరతలు ఐ.ప్రసాదరావు తన సొంత నిధులతో సమకూర్చారని పేర్కొన్నారు. గతంలో యూటిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే పదవ తరగతి ఉత్తీర్ణతలో ఉత్తమ స్థానాలు పొందిన విద్యార్థులకు, పాఠశాలలకు అనేక మార్లు మెమొంటోలు సమకూర్చారని వర్మ పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శి చక్రవర్తి మాట్లాడుతూ ఐ.ప్రసాదరావు సంఘానికి చేసే సేవ, దాత్రుత్వ కార్యక్రమాలు వెలకట్టలేనివి అని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఐ.ప్రసాదరావు అందరికీ మార్గదర్శి అని, ఇటువంటి సేవా గుణాలు కార్యకర్తలు అలవాటు చేసుకోవాలి అని తెలిపారు. తదనంతరం ఈ సభలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష రద్దు చేయాలని కోరుతూ ఛలో విజయవాడ పోస్టర్ ఆవిష్కరించారు. చలో విజయవాడ కార్యక్రమంలో అందరూ పాల్గొని, కార్యక్రమం జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు సూరిబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోవిందరాజులు, సోని, టి.వేణుగోపాల్, సుధీర్, భాను ప్రకాష్, గణేష్, ఆడిటర్ రాజుబాబు, పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.
యుటిఎఫ్ సంఘానికి పోడియం బహుకరణ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 30, 2026, 03:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)