శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పంటకు నీరందించండి : రైతు - లంచం ఇవ్వు : జలవనరుల అధికారి

03 ఆగస్టు, 2026

"Provide water for the crop" — Farmer; "Pay a bribe" — Water Resources Official.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 03, 2026, 05:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కాకినాడ : తనకు బతుకుదెరువైన అర ఎకరం భూమిలో పంట ఎండిపోతుందని ఆ పంటను నీరు అందించి కాపాడాలని కోరిన రైతును అందుకు లంచం డిమాండ్ చేయడమే కాకుండా అతనిపైనే కరప పోలీసు స్టేషన్ లో తప్పుడు కేసు నమోదు చేసిన విషయం కాకినాడలోని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమంలో వినతిపత్రంను రైతు పెదపూడి మండలం కాండ్రేగుల గుబ్బల వారి పాలెంకు చెందిన గెద్దాడ త్రిమూర్తులు అందించారు. ఈ సందర్భంగా త్రిమూర్తులు ఆ వినతిపత్రంలో విషయాలను వెల్లడించారు. గుబ్బలవారిపాలెంలో తమకు అర ఎకరం పొలం ఉందని దాన్ని అన్న సత్యనారాయణతో కలిపి పండించుకుంటున్నామన్నారు. పంట ఎండిపోతుందని దానికి నీరు అందించాలని ఇంద్రపాలెం లాకుల వద్ద ఉన్న నీటిపారుదల శాఖ కార్యాలయములో సంబంధిత అధికారి నాగిరెడ్డి గంగాభవానికి తెలియజేశామన్నారు. అందుకు ఆమె పంటకు నీరు అందించాలంటే కొంత నగదు ఇవ్వాలని అడగగా తాము ఇచ్చుకోలేమంటూ బదులిచ్చామని చెప్పారన్నారు. ఆమె తానే కాకుండా తన పై అధికారులకు కూడా ఇవ్వాలని చెప్పారన్నారు. అందుకు గంగాభవానికి డబ్బులు ఇవ్వలేదని కోపంతో కరప పోలీస్ స్టేషన్ లో తమపై పొలం నీరు డాం వేశారంటూ తమపై తప్పుడు కేసు పెట్టారని దీనిపై తమ కుల పెద్దలతో కలిసి కేసు రాజీ చేసుకుందామని ఆమెను అడిగామన్నారు. అప్పుడు ఆమె వేములవాడలో ఉన్న జీవి సత్యనారాయణను కలవాలని చెప్పిందన్నారు. అలా ఒకరి తర్వాత ఒకరిని కలుస్తూ వచ్చినా సమస్య తీరకపోగా తమను వారి సామాజిక వర్గ నేతలు హేళనగా మాట్లాడి కించపరిచారని రైతు త్రిమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న రైతు అయిన తనపై తన అన్న పైనా తప్పుడు కేసు పెట్టిన గంగా భవానిపైన శాఖా పరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని వినతిపత్రంలో రైతు త్రిమూర్తులు కోరారు. అలాగే తక్షణమే స్పందించి పంటకు నీరు అందించాలని వారు కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్