గురువారం, 23 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

తాండవ సాగునీరు విడుదలపై జులై 18న అభిప్రాయ సేకరణ

16 జులై, 2026

kakinada
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 16, 2026, 03:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - కోటనందూరు : తాండవ రిజర్వాయర్ నుండి ఈ ఏడాది ఖరీఫ్ పంటలకు సాగునీరు విడుదలపై అనకాపల్లి,కాకినాడ జిల్లాల రైతులతోనూ, నీటి సంఘ అధ్యక్షులు, అభిప్రాయ సేకరణ సమావేశాన్ని శనివారం నిర్వహించనున్నట్లు తాండవ డిఈ పి.అనురాధ తెలిపారు. తాండవ రిజర్వాయర్ పరిధిలో నాతవరం, నర్సీపట్నం కోటనందూరు, తుని, మండలాల పరిధిలో 22,567 రైతులు ఉండగా 51,465 వేల ఎకరాలకు సాగునీరు అందించవలసి ఉందని అన్నారు. ప్రస్తుతం తాండవ రిజర్వాయర్‌లో 375.O1 నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశానికి తాండవ రిజర్వాయర్ చైర్మన్ కరక సత్యనారాయణ, వైస్ చైర్మన్ మేడపురెడ్డి జోగు బాబు, ఆయా శాఖ అధికారులు పాల్గొంటారని, రైతుల అభిప్రాయం మేరకు నీటి విడుదల తేదీని ప్రకటించడం జరుగుతుందని డిఈపి.అనురాధ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్