శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆశా వర్కర్ల సమస్యలపై ఎంఎల్ఎకు వినతి పత్రం

06 అక్టోబర్, 2026

kakinada
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 03:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - జగ్గంపేట : సిఐటియు అధ్వర్యంలో నియోజకవర్గంలోని ఆశావర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఎంఎల్ఎ జ్యోతుల నెహ్రూకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. 7 సంవత్సరాలుగా కనీస వేతనాలు పెంచలేదని, 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎలాంటి సెలవులు లేకపోవడంతో అనారోగ్యాల పాలవుతున్నామని వారు ఎంఎల్ఎ కు విన్నవించారు. అంగన్వాడీలకు అమలవుతున్న అన్ని రకాల సెలవులను తమకు అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం చెల్లించే 10 వేల నెల జీతంలో పిహెచ్సీలకు వెళ్లడానికి రూ. 3 నుండి 4 వేలు ఖర్చవుతోందన్నారు. సంబంధం లేని పనులు చేయించడంతో తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నామని వినతిపత్రంలో పేర్కొన్నారు. మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎంఎల్ఎ వారికి హామీ ఇచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్