శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజా సమస్యలపై ఎంఎల్ఎ కు వినతులు

18 గంటల క్రితం

Representations submitted to the MLA regarding public issues.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 03:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - జగ్గంపేట (కాకినాడ) : స్థానిక నియోజకవర్గ టిడిపి కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్ లో పలు సమస్యలపై ప్రజలు ఎంఎల్ఎ జ్యోతుల నెహ్రు వినతులు అందజేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు పెన్షన్లు, గృహ రుణాలు, ఇళ్ల స్థలాలు, సిఎంఅర్ఎఫ్ తదితర సమస్యలను ఎంఎల్ఎ దృష్టికి తీసుకువచ్చారు. దాంతో ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను నిరంతరం అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు, టిడిపి నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, బుర్రి సత్తిబాబు, నీలం శ్రీను, రేఖ బుల్లి రాజు, పాండ్రంగి రాంబాబు, రాయి సాయి, మారిశెట్టి రాధా, దొడ్డ శ్రీను, పోట్రు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్