ప్రజాశక్తి-సామర్లకోట : స్థానిక యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్ హైస్కూల్లో పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు రూ.35 వేల విలువైన ప్రోత్సాహక డీడీలను శనివారం పంపిణీ చేశారు. పాఠశాల వ్యవస్థాపకుడు యార్లగడ్డ అక్కిరాజు మనవడు యార్లగడ్డ విజయప్రసాద్ తరఫున యార్లగడ్డ వీరభద్రరావు మూడేళ్లుగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. పాఠశాల హెచ్ఎం కె.శ్రీదేవి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో యార్లగడ్డ వీరభద్రరావు మాట్లాడుతూ విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి భవిష్యత్తులో మరింత ఉన్నత ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. హెచ్ఎం కె.శ్రీదేవి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రోత్సాహకాలు అందుకుంటున్న విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి, పదిమందికి ప్రోత్సాహకాలు అందించే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. గణిత ఉపాధ్యాయిని కె.అరుణ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు తమ లక్ష్యాలకు దూరం కాకుండా ఇటువంటి ప్రోత్సాహకాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎ.ఎల్.వి. కుమారి, యు.నాగమణి, కాంతిప్రియ, ఎ.వెంకటలక్ష్మి, డి.సూర్యనారాయణ, సిహెచ్.వి. భద్రమ్మ, ఎస్.రామలక్ష్మి, వై.కుమార్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు రూ.35 వేల ప్రోత్సాహకాలు పంపిణీ
14 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 14, 2026, 06:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)