ప్రజాశక్తి - జగ్గంపేట (కాకినాడ) : మండలంలోని రామవరం వద్ద ఆదివారం యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ..... కిర్లంపూడి మండలం సోమవరం గ్రామానికి గొల్లపల్లి వెంకటేష్ (25) రామవరం నుండి మర్రిపాక వెళ్ళే రహదారిలో రక్తపు గాయాలతో రోడ్డు పక్కన పడి ఉన్నాడు. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే ఆ యువకుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రికి తీసుకుని వెళ్లి యువకులే హత్య చేశారని మృతిని బంధువులు ఫిర్యాదు చేయడంతో హత్య, రోడ్డు ప్రమాదమా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
యువకుడు అనుమానాస్పద మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 26, 2026, 03:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)