ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యాశాఖ బాధ్యతలను చేపట్టిన ప్రహ్లాద్ జోషి

2 గంటల క్రితం

Pralhad Joshi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 04:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి విద్యాశాఖ బాధ్యతలను చేపట్టారు. ఆదివారం కర్తవ్య భవన్‌లో ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ప్రహ్లాద్‌ జోషి మంత్రిత్వ శాఖ కార్యకలాపాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ పథకాలు, ఇతర కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు. కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ వినీత్ జోషి, పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి టి.కె. అనిల్ కుమార్, అలాగే మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ శనివారం విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయడంతో, ఆయన స్థానంలో ప్రహ్లాద్‌ జోషిని నియమిస్తున్నట్లు రాష్ట్రపతి ఉత్తర్వుల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రహ్లాద్‌ జోషి వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం- ప్రజాపంపిణీ, , పునరుత్పాదక ఇంధనం శాఖ బాధ్యతలను నిర్వరిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్