ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ నగర అభివృద్ధే లక్ష్యంగా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కాకినాడ సిటీ వనమాడి ఎంఎల్ఎ కొండబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సంతచెరువు సమీపంలోని శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూటమి నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని, అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ కొండబాబు మాట్లాడుతూ కాకినాడ నగర మేయర్ అభ్యర్థి ఆకుల భవానితో పాటు 66 డివిజన్లలో పోటీ చేస్తున్న టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో కాకినాడ నగర అభివృద్ధి కుంటుపడిందని, స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన పలు పనులు నిలిచిపోయాయని విమర్శించారు. తిరిగి నగరాభివృద్ధికి వేగం పెంచి, నిలిచిపోయిన పనులన్నింటినీ పూర్తిచేసి కాకినాడను రాష్ట్రంలోనే నంబర్ వన్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. డబ్బు, హోదా కాకుండా సాధారణ కార్యకర్తగా కష్టపడి పని చేసిన సామాన్య కార్యకర్తలకు ఉన్నత అవకాశాలు పని చేసిన వారిని అభ్యర్థిలగా ప్రకటించడం ద్వారా కూటమి నాయకత్వం కార్యకర్తలకు ఇచ్చే ప్రాధాన్యతను చాటిందని పేర్కొన్నారు. మేయర్ అభ్యర్థి భవాని ప్రవీణ్, కార్పొరేటర్ల మధ్య సమన్వయం సాధిస్తూ నగర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
నంబర్ వన్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతాం
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 20, 2026, 05:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)